
చాకరిమెట్లలో పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణస్వామి మండపంలో దంపతులు సామూహిక వ్రతాలు ఆచరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు.
వైభవంగా
బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ
దుబ్బాక: పట్టణంలో శనివారం ప్రధాన గ్రామదేవత బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీదేవి) విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది.అంతకు ముందు వేదస్వస్తి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్త్‌లో అమ్మవారి కృపతో దుబ్బాక పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఉత్సవంలో పట్టణంలోని అన్ని కులసంఘాల పెద్దలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో రాణించాలి
మెదక్ మున్సిపాలిటీ: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఎలైట్ ప్రీమియర్ లీగ్– సీజన్ 1 టోర్నమెంట్ ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సాయిలాటిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ తెలంగాణ పోలీస్, టాలీవుడ్ హీరోస్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు జట్లు అద్భుతమైన క్రీడా ప్రదర్శన కనబరిచినా, తెలంగాణ పోలీస్ జట్టు విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సాయిలాటి కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సీజేఐపై దాడికి యత్నం అమానుషం
గజ్వేల్: సీజేఐ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. శనివారం దళిత, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, దళిత, ప్రజా సంఘాల నా యకులు మాట్లాడుతూ.. సీజేఐపై దాడి..దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నా.. ఆధిపత్య కులాల నుంచి అవమానాలు తప్పడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు.

చాకరిమెట్లలో పూజలు

చాకరిమెట్లలో పూజలు

చాకరిమెట్లలో పూజలు