
మెరుగైన వైద్యం అందించండి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఓపీ రికార్డులను పరిశీలించారు. మందులను పరిశీలించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. గత నెలలో మండల పరిధిలో ఎంతమందికి డెలివరీలు చేయించారని ఏఎన్‌ఎంలను ప్రశ్నించారు. ఆస్పత్రి ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సిబ్బంది రాజిరెడ్డి, అనిత ఏఎన్‌ఎంలు, సిబ్బంది ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. వసతి గృహంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సహించేదిలేదని సిబ్బందిని హెచ్చరించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్