
కాంగ్రెస్‌లోకి మాజీ జెడ్పీటీసీ
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ ఏఎంసీ చైర్మన్ పోతరాజ్ రమణ కాంగ్రెస్‌లో చేరారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో పార్టీలో చేరారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన రమ ణ, ఎన్నికల అనంతరం క్రియాశీల రాజకీయా లకు దూరంగా ఉన్నారు. మైనంపల్లి పిలుపుతో తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, ప్రభాకర్, రాజ్‌కుమార్, ఉదయ్ ఉన్నారు.