
విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించాలి
హవేళిఘణాపూర్(మెదక్): ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాంలో విద్యార్థినులు పాల్గొనడం అభినందనీయమని ఏఎస్పీ మహేందర్ అన్నారు. గురువారం కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సమాజ సేవతో పాటు విద్య, వైద్య, పోలీస్ లాంటి రంగాలను ఎంచుకొని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీలత, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, సుధారాణి అరుంధతి, దీప్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఏఎస్పీ మహేందర్