
ఆర్టీఐ సేవల్లో జిల్లాకు రెండో స్థానం
మెదక్ కలెక్టరేట్: సమాచార హక్కు చట్టం నిర్వహణలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు రెండోస్థానం దక్కింది. సమాచార హక్కు చట్టం వారోత్సవాలు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్‌రాజ్ అవార్డు అందుకున్నారు. 19 నెలల కాలంలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో నిబద్ధతకు ప్రతిభా పురస్కారం అందజేశారు. ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పెండింగ్ లేకుండా వ్యవహరిస్తున్నందుకు గాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. అధికారులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.