
అర్బన్ పార్కు సందర్శించిన రాష్ట్ర అధికారి
నర్సాపూర్: అటవీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్థానిక అర్బన్‌పార్కును రాష్ట పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీకి స్థానిక ఎంపీఓ శ్రీనివాస్ పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో అర్బన్‌పార్కులో పర్యటించి వాచ్ టవర్‌పై నుంచి పచ్చని అడవీ అందాలను వీక్షించారు. అర్బన్ పార్కు బాగుందని జాన్‌వెస్లీ కితాబిచ్చారు.
డీఏ ను విడుదల చేయాలి
ఎమ్మెల్సీ కొమురయ్యకు
తపస్ నాయకుల విజ్ఞప్తి
చేగుంట(తూప్రాన్): 2008 కాట్రాక్టు ఉద్యోగుల జీతాలు, పెండింగ్ డీఏ, 317 బాదితుల సమస్యలను వివరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తపస్ నాయకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు లక్ష్మణ్ తదితరులు కొమురయ్యను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో తపస్ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నవాతు సురేశ్, కార్యదర్శి నవీన్, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎల్లం, జిల్లా బాధ్యేలు శేఖర్, మల్లేశం, శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు తదితరులు ఉన్నారు.
ట్రయల్‌రన్ నిర్వహించిన
అధికారులు
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామ శివారులో తెగిపోయి రైల్వేబ్రిడ్జిను సరి చేసిన అధికారులు రైల్వే ఇంజన్‌తో బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ మీదుగా మెదక్‌కు రైలు రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 11గంటలకు మెదక్ చేరుకోనున్న ఈ రైలు గురువారం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనుంది.
ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్
శతాబ్ది ఉత్సవాలు
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) శతాబ్ది ఉత్సవాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీటీడీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ మెదక్ విభాగ్ సహ కార్యావాహ బి.నర్సింలు మాట్లాడుతూ..హిందువులందరూ సంఘటితంగా ఉండాలని, దేశ సమగ్రతను కాపాడటంలో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులందరూ భాగస్వాములు కావాలని కోరారు. వందేళ్ల ఈ ఉత్సవాలను తరతరాలకు గుర్తిండిపోయేలా విజయవంతం చేయాలని, పంచ పరివర్తనలో భాగంగా కుటుంబ ప్రబోధన్ సామాజిక సమరసత, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులు తదితర అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో జైహింద్‌రెడ్డి, సీతారాం, సతీశ్‌గౌడ్, రవివర్మ, క్రాంతీలాల్, సర్వేశ్వర్, వీరప్ప,శ్రావణ్, శివశంకర్, విఠల్, నందు, దత్తు తదితరులున్నారు.

అర్బన్ పార్కు సందర్శించిన రాష్ట్ర అధికారి

అర్బన్ పార్కు సందర్శించిన రాష్ట్ర అధికారి