
ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై
బతుకమ్మ, దాండియా ఆటలతో
దుమ్మురేపే ఆడపడుచులు
యువకుల అలయ్– బలయ్ దుబ్బాకలో ప్రత్యేకం
దుబ్బాక/దుబ్బాకటౌన్: పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా గాంధీ విగ్రహం వద్ద ఏకమై రావణ దహనం చేస్తారు. అనంతరం ఆడపడుచుల బతుకమ్మ, దాండియా ఆటలతో అలరిస్తారు. యువకులు, పెద్దలు అలయ్ – బలయ్ కార్యాక్రమాలు, యువకుల డ్యాన్సులు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. పట్టణాలను నుంచి వచ్చిన ఉద్యోగస్తులు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుకుంటారు. దసరా రోజే కాకుండా దేవి శరన్నావరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండల పాల వద్ద వారం పాటు ఆడపడుచుల దాండియా, బతుకమ్మ ఆటపాటలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. అలాగే దసరారోజున పట్టణంలోని చెల్లాపూర్‌రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జమ్మిచెట్టు వద్దకు డప్పుచప్పుళ్లతో వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ.

ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై