
మంజీరా వరదలతో అప్రమత్తం
పాపన్నపేట(మెదక్): పోటెత్తుతున్న మంజీరా వరదలతో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. ఏడుపాయల ఆలయం ముందు బుధవారం ఆయన మంజీర వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఘనపురం ఆనకట్టపై నుంచి 1.09 లక్షల నీరు వెళ్తుందన్నారు. వరదలు ఉధృతంగా ఉండటంతో ఎల్లాపూర్ బ్రిడ్జిని తాకుతూ నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రవాహం పెరిగితే రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉన్నందున, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నది వైపు ఎవరు వెళ్లొద్దని చెప్పారు.
ఎల్లాపూర్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్న మంజీరా