నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

Sep 19 2025 6:15 AM | Updated on Sep 19 2025 6:15 AM

నేడు

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక వేతనాల్లో కోత అన్యాయం రిజర్వేషన్‌ కౌంటర్‌తో తీరనున్న కష్టాలు పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

చేగుంట(తూప్రాన్‌): మండలంలోని పొలంపల్లికి శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య రానున్నట్లు దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత మహిళ లక్ష్మి కుటుంబీకులను పరామర్శిస్తారని తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుంటారని చెప్పారు.

మెదక్‌ కలెక్టరేట్‌: తమకు రావాల్సిన వేతనాల్లో కోత పెట్టడం అన్యాయమని మెదక్‌ మైనార్టీ బాలికల హాస్టల్‌, కళాశాల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిరసన తెలిపి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వేతనాలు అందజేసిన ప్రభుత్వం కోతపెట్టిందని వాపోయారు. ఎక్కడైన వేతనాలు పెంచుతారు కానీ, తగ్గించడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హాస్టల్‌, కళాశాల ఉద్యోగినులు రాజేశ్వరీ, చైతన్య, జయశ్రీ, లలిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రంలోని వడియారం రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. చేగుంట సమీపంలోని డివిజన్‌ కేంద్రాలైన రామాయంపేట, తూప్రాన్‌తో పాటు వెల్దుర్తి, చిన్నశంకరంపేట, మాసాయిపేట, నార్సింగి, దౌల్తాబాద్‌ తదితర మండలాల్లోని పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాల కార్మికులు పని చేస్తున్నారు. వీరితో పాటు స్థానికులు వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లో టికెట్లు బుకింగ్‌ చేసుకునేవారు. లేదంటే ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ సెంటర్లలో ఎక్కువ డబ్బులు చెల్లించేవారు. వడియారం రైల్వేస్టేషన్‌కు రిజర్వేషన్‌ కౌంటర్‌ మంజూరు కాగా, ఈనెల 22న ఎంపీ రఘునందన్‌రావుతో పాటు రైల్వే అధికారులు ప్రారంభించనున్నారు.

నాణ్యమైన విత్తనాలు

ఎంచుకోవాలి

నర్సాపూర్‌ రూరల్‌: రైతులు పంటలు సాగు చేసే ముందు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని నత్నయ్యపల్లిలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లక్ష్మణ్‌ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో వ్యవసాయశాఖ పంపిణీ చేసిన ఎంటీయూ 1010 వరి విత్తనాలతో పంట సాగు చేసిన రైతు పెంటేశ్‌ పొలా న్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు సా గు చేసే ముందు భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాటి ఫలితాల అనుగుణంగా పంటలు వేయాలని తెలిపారు. అనంతరం పంటల రకాలు, సాగులో మెలకువలపై అవగాహన కల్పించారు. నానో యూరియాతో మంచి లాభాలు ఉంటాయని మండల వ్యవసాయ అధికారి దీపిక వివరించారు. కార్యక్రమంలో ఏఈఓలు లక్ష్మి, తేజస్విని, ఆత్మ బీటీఎం హరిత, రైతులు పాల్గొన్నారు.

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలో గురువారం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌ అధికారులకు తాము కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన ఉండాలని సూ చించారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు. ప్రతి రోజు వాహనాల తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్‌, ఎస్‌ఐ రాజేష్‌ ఉన్నారు.

నేడు ఎస్సీ, ఎస్టీ  కమిషన్‌ చైర్మన్‌ రాక 
1
1/2

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

నేడు ఎస్సీ, ఎస్టీ  కమిషన్‌ చైర్మన్‌ రాక 
2
2/2

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement