
22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్న వన దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో ఈనెల 22 నుంచి దేవి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆల య సిబ్బంది గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. మొ దటి రోజు సోమవారం దుర్గమ్మ తల్లి బాలత్రిపుర సుందరి దేవి అలంకారంతో దర్శనమిస్తారు. మంగళవారం గాయత్రీదేవి, బుధవారం అన్నపూర్ణ, గురువారం వనదుర్గాదేవి, శుక్రవారం మహాలక్ష్మిదేవి, శనివారం లలిత త్రిపుర సుందరీదేవి, ఆదివారం మహాచండి, సోమవారం సరస్వతీ దేవి, మంగళవారం దుర్గాదేవి, బుధవారం మహిషాసుర మర్దిని, గురువారం రాజరాజేశ్వరిదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. కాగా ఈనెల 29న అమ్మవారికి బోనాలు, అక్టోబర్ 1న సువా సిని పూజ, చండీహోమం ఉంటుంది. వనదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి రోజు అన్నదానం నిర్వహిస్తారు.

22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు