
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్)/పాపన్నపేట: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఉన్నత పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదుల చుట్టూ పరిశుభ్రత, నీటి సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాపన్నపేట పీహెచ్‌సీలో కొనసాగుతున్న స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటికి దీపమైన ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమంపై దృష్టి పెట్టి, యాక్షన్ ప్లాన్ రూపొందించాయన్నారు. 15 రో జులు ప్రతి వైద్య కేంద్రంలో నిరంతర వైద్య సేవలు అందిస్తామని వివరించారు.