
గణపతి మండపం వద్ద హోమం
వినాయక మండపంలో హస్నొద్దీన్, సీఐ, తదితరులు
గణపతి మండపం వద్ద హోమం నిర్వహిస్తున్న
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద మంగళవారం హోమం నిర్వహించారు. అర్చకులు దిగంబర శర్మ,శేషాద్రిశర్మల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. నరేందర్‌గౌడ్, రాజేశ్వర్ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు. మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మతసామర్యం వెల్లివిరిసే..
రామాయంపేట(మెదక్): మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం యువకుడు రామాయంపేటలోని వినాయకుని మండపంవద్ద అన్నదానం చేశారు. పట్టణంలోని మూడో వార్డులో ఎల్లమ్మ మందిరం వద్ద కాలనీవాసులు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే కాలనీకి చెందిన హస్నొద్దీన్ అనే యువకుడు మంటపం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హస్నొద్దీన్‌ను కాలనీవాసులతోపాటు సీఐ, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్ తదితరులు సన్మానించి ప్రశంసించారు.
సామూహిక కుంకుమార్చన
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్థానిక మాధవనగర్‌లో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు ఆయా మండపాల వద్ద భక్తులు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.

గణపతి మండపం వద్ద హోమం

గణపతి మండపం వద్ద హోమం