
రైల్వేలైన్ విస్తరణకు స్థల పరిశీలన
రామాయంపేట(మెదక్): మేడ్చల్–ముద్కేడ్ రైల్వేలైన్ విస్తరణ కోసం అడుగులు పడుతున్నాయి. మండలంలోని అక్కన్నపేటవద్ద ఆశాఖ అధికారులు బుధవారం భూసేకరణలో భాగంగా స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్‌తోపాటు స్టేష న్ ఆధునికీకరణ నిమిత్తం ఎంత భూమి అవసరమవుతుందనే విషయమై అధికారులు సమీక్షించారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. రైల్వే అధికారులతోపాటు మెదక్ ఆర్డీఓ రమాదేవి, స్థానిక తహసీల్దార్ రజని, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): అత్యాశకు పోయి ఆన్‌లైన్ మోసాల ఉచ్చులో చిక్కుకోవద్దని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ తెలిపారు. బుధవారం పాపన్నపేటలోని జూనియర్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి లింకులు వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీటీంలు కఠినంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. అనవసరంగా కేసుల్లో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సైబర్ డీఎస్పీ సుభాశ్ చంద్రబోస్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, షీటీం ఏఎస్‌ఐ వెంకట య్య, ప్రమీల, డ్రగ్స్ నిర్మూలన అధికారి సతీశ్, ప్రిన్సిపాల్ నర్సింలు, విద్యార్థులు పాల్గొన్నారు.
భూసేకరణ ప్రక్రియ ప్రారంభం
చిన్నశంకరంపేట(మెదక్): సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వేలైన్ డబుల్‌లైన్ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియను మెదక్ ఆర్డీఓ రమా దేవి ప్రారంభించారు. బుధవారం చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను రైల్వే అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు రైతులను గుర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడ్చల్–మనోహరాబాద్ మధ్యన డబుల్‌లైన్ పను లు కొనసాగుతున్నాయని అన్నారు. మనోహరాబాద్–అక్కన్నపేట మధ్యన భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే డబుల్‌లైన్ పనులు ప్రారంభం కానున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఆర్‌ఐ రాజు ఉన్నారు.
7వరకు అన్నీ గ్రామాల్లో స్పెషల్‌డ్రైవ్: డీపీఓ యాదయ్య
కౌడిపల్లి(నర్సాపూర్): ఈ నెల 7వరకు అన్నీ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీపీఓ యాదయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వెల్మకన్నలో పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల ప్రభావంతో దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందని నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. వైద్య సిబ్బందితో డ్రైడే నిర్వహించాలని సూచించారు. మురికి కాల్వలు, పరిసరాల్లో చెత్త ఎప్పటికప్పడు శుభ్రం చేయాలన్నారు. పల్లెప్రకృతి వనం, వన నర్సరీల్లో పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ సాయిబాబా, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, ఏపీఓ పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా వెంకటేశ్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈఓ ఆలయానికి ఉద యం రావడంతో అర్చకులు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ తన చాంబర్‌లో ఏఈఓ బుద్ది శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

రైల్వేలైన్ విస్తరణకు స్థల పరిశీలన

రైల్వేలైన్ విస్తరణకు స్థల పరిశీలన