
యూరియా కోసం రాస్తారోకో
తూప్రాన్: యూరియా కోసం రైతులకు ఇక్కట్లు తప్పడంలేదు. మండలంలోని యావపూర్‌లో గ్రామ పంచాయతీ వద్ధ వ్యవసాయాధికారులు సగం మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారని రైతులు ఆందోళనకు దిగారు. తూప్రాన్–గజ్వేల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ శివానందం రైతులతో సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కాగా, దుకాణాల వద్ద రైతులు గూమికూడకుండా ఉండేందుకు క్లస్టర్ల వారీగా గ్రామాల్లోనే రైతుకు రెండు బస్తాల యూరియా చొప్పున వ్యవసాయాధికారులు టోకెన్లు పంపిణీ చేశారు.