
ప్రజారోగ్యానికి పెద్దపీట
ఎమ్మెల్యే రోహిత్‌రావు
మెదక్ కలెక్టరేట్: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేశామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా మెదక్ ఆర్డీఓ రమాదేవికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టామన్నారు. ప్రజలకు జ్వరాలు సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉచిత శిక్షణను
సద్వినియోగం చేసుకోవాలి
నర్సాపూర్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె కోరారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఈఈఈ ఎస్‌బీ అండ్ పీఈఎస్ సొసైటీ భాగస్వామ్యంతో బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలోని ఈఈఈ బ్రాంచ్ ఆధ్వర్యంలో సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు వారం రోజుల పాటు ఈ శిక్షణ నిర్వహించనున్నామని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సౌర వ్యవస్థల నిర్వహణ, విద్యుత్ భద్రతా చర్యలు, విద్యుత్ వాహన సాంకేతికత తదితర అంశాలపై ఉచిత శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈఈఈ హెచ్‌ఓడీ రాయుడును ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె అభినందించారు. కార్యక్రమంలో మేనేజర్ బాపిరాజు, ఏఏఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
166 మంది గైర్హాజరు
ఇంటర్ నోడల్ ఆధికారి మాధవి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,332 మంది విద్యార్థులకు గానూ 122 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జరిగిన పరీక్షలకు మొత్తం 761 మంది హాజరు కావాల్సి ఉండగా 44 మంది గైర్హాజయ్యారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో మొత్తం 166 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ ఆధికారి మాధవి తెలిపారు.
తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు
● జూన్ 14 నుంచి ప్రారంభం
● ఐఆర్‌సీటీసీ జనరల్ మేనేజర్ కిశోర్
మెదక్ కలెక్టరేట్: తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని ఐఆర్‌సీటీసీ జనరల్ మేనేజర్ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ బీమా, అలాగే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు అందజేస్తారని తెలిపారు. రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రతా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు, టికెట్ బుకింగ్ కోసం 97013 60701, 92810 30712, 92814 95845, 92810 30749, 92810 30750లకు సంప్రదించాలని కోరారు.
క్రీడల హాస్టళ్లకు
విద్యార్థుల ఎంపిక
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రంలోని రీజినల్ స్పోర్స్ హాస్టళ్లలో చేరడానికిగాను ఆసక్తి గల క్రీడాకారు లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ఒకటి నుంచి 13వ తేదీ వరకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. వాలీబాల్, సైక్లింగ్, జిమ్నాస్టిక్, స్విమ్మింగ్, అథ్లెటి క్స్, హ్యాండ్‌బాల్, హాకీ క్రీడల్లో పోటీలు ఉంటా యని పేర్కొన్నారు. 10 నుంచి 12 ఏళ్లలోపు వా రికి జిమ్నాస్టిక్, స్విమ్మింగ్ 12 నుంచి 16 లోపు వారికి అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, హాకీ, వాలీబాల్, కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపా రు. సమాచారం కోసం జిల్లా యువజన కార్యా లయంలో సంప్రదించాలని సూచించారు.

ప్రజారోగ్యానికి పెద్దపీట

ప్రజారోగ్యానికి పెద్దపీట