'స్వతంత్ర అభ్యర్థుల' ఓట్లు.. మిగతా పార్టీలకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా?

- - Sakshi

నష్టం చేకూరేలా ఉంటే విత్‌డ్రా కోసం విజ్ఞప్తి!

మేలు జరిగేలావుంటే ప్రోత్సాహం..

బేరీజు వేసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు బరిలో ఉంటే తమకు పడాల్సిన ఓట్లు చీలిపోతాయా? లేదంటే వ్యతిరేకత ఓటు చీలి పోయి మేలు జరుగుతుందా? ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు లోతైన విశ్లేషణల్లో నిమగ్నమయ్యారు. తమ గెలుపు కోసం పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళుతున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశ విషయమై నిర్లక్ష్యం చేయడం లేదు.

నష్టం చేసే అవకాశాలున్న చోట్ల స్వతంత్రులతో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లాభం చేకూర్చే అవకాశాలుంటే బరిలో ఉండాలని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని చోట్ల స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు స్వతంత్రులు తమ సమస్యను ప్రజల దృష్టికి తెచ్చేందుకు, మరికొందరు ప్రతి ఎన్నికల్లో బరిలో ఉండాలని నామినేషన్లు వేస్తుంటారు. ఇలా ఈసారి కూడా కొందరు నామినేషన్లు వేశారు.

బ్యాలెట్‌ యూనిట్లు పెంచాల్సిన పరిస్థితి..
బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగితే బ్యాలెట్‌ యూనిట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణీత సంఖ్య లోపు అభ్యర్థులుంటే ఒక్క బ్యాలెట్‌ యూనిట్‌ సరిపెట్టొచ్చు. కానీ ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్‌ యూనిట్లను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఓటర్లు అభ్యర్థుల గుర్తులను వెతుక్కోవడంలో కొంత మేరకు అయోమయం నెలకొనే అవకాశం ఉంటుంది.

రేపటితో ముగియనున్న గడువు!
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది స్వతంత్రులతో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తే వీలైనంత ఎక్కువ మెజారిటీ సాధించవచ్చని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ఉపసంహరణకు కేవలం ఒక రోజే గడువు ఉండటంతో అభ్యర్థులు.. స్వతంత్రులను కలిసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని..
గతంలో స్వతంత్ర అభ్యర్థుల కారణంగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మారిపోయింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తును పోలిన గుర్తులు వీరికి కేటాయించడంతో తీవ్రంగా నష్టపోయారు. తమకు పడాల్సిన ఓట్లు వేలల్లో స్వతంత్రులకు పడ్డాయని వారు భావిస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనూ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవి చదవండి: తమ్మీ.. నువ్వు జర తప్పుకోరాదె! నీకేం కావాలో చెప్పు ఇస్తా!!

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 08:49 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 07:55 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...
14-11-2023
Nov 14, 2023, 05:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:03 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:01 IST
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్‌ ఉండాలంతే.. పంచ్‌ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్‌...
14-11-2023
Nov 14, 2023, 04:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న...
14-11-2023
Nov 14, 2023, 04:45 IST
ఎస్‌. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా...
14-11-2023
Nov 14, 2023, 04:32 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ...
14-11-2023
Nov 14, 2023, 04:18 IST
బొల్లోజు రవి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా...
14-11-2023
Nov 14, 2023, 04:02 IST
మేకల కళ్యాణ్‌ చక్రవర్తి  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ...
14-11-2023
Nov 14, 2023, 02:03 IST
పార్టీ టికెట్‌ సాధన మొదలు, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాల పర్వం వరకు మొత్తం రూ.కోట్ల డబ్బు...
14-11-2023
Nov 14, 2023, 01:31 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే...
14-11-2023
Nov 14, 2023, 01:17 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి, వరంగల్‌/నర్సంపేట: ‘సాగుకు సంబంధించి బాగోగులు తెలియని కాంగ్రెస్‌ నేతలు వ్యవసాయానికి 3 గంటల...
14-11-2023
Nov 14, 2023, 01:15 IST
 సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా...
13-11-2023
Nov 13, 2023, 16:23 IST
బీజేపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన.. 
13-11-2023
Nov 13, 2023, 16:16 IST
సాక్షి,ఖమ్మం : తన నామినేషన్‌ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు....
13-11-2023
Nov 13, 2023, 14:55 IST
పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్‌చాలని 

Read also in:
Back to Top