దండేపల్లి: ప్రభుత్వ అధికారులకు సెలవు రోజైన ఆదివారం అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దండేపల్లి మండలం రెబ్బనపల్లి, గూడెం గుట్టల్లో మొరం దందా జోరుగా సాగుతోంది. సాధారణ రోజుల్లో అయితే రాత్రి పూట మొరం తవ్వకాలు జరుపుతున్నారు. ఇక ఆదివారమైతే అధికారులు ఎవరూ రారానే ధీమాతో దర్జాగా పట్టపగలే తవ్వకాలు చేస్తు, మొరం తరలించుకుపోతున్నారు. మండలంలోని రెబ్బనపల్లి శివారులోని గుట్టకు ఆదివారం అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకునేలోపు తవ్వకాలు చేసే జేసీబీని అక్కడ నుంచి తరలించారు. అయితే మొరంలోడుతో వస్తున్న ఒక ట్రాక్టర్‌ను మాత్రం రెవెన్యూ సిబ్బంది పట్టుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్‌లోని మొరాన్ని బయట డంప్ చేసి ఖాళీ ట్రాక్టర్‌ను స్టేషన్‌లో పెట్టడం అనుమాలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు అక్రమ దందాపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెవెన్యూ సిబ్బంది
పట్టుకున్న ట్రాక్టర్
మొరం తరలిస్తున్న ట్రాక్టర్


