గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి జూమ్‌ మీటింగ్‌ ద్వారా పుష్కర ఏర్పాట్లపై గోదావరినది తీరం జిల్లా ల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యశిబిరాలు, ఇతర సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

పనులు ప్రారంభించాలి

చెన్నూర్‌: గోదావరి పుష్కర పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. శనివారం గోదావరి చెన్నూర్‌ పుష్కర ఘాట్‌తోపాటు పెద్ద చెరువు శివలింగాన్ని పరిశీలించారు. పుష్కర ఘాట్లు, శార్థ మండపం, అమ్మవారి ఆలయం పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువు శివలింగం, మదనం పోచమ్మ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ టెండర్‌ పూర్తి కాలేదన్నారు. ఇరిగేషన్‌ డీఈ దామోదర్‌, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఏఈ వినీత్‌, ఎంపీడీవో అజ్మత్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement