ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

● రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాలక్రైం: ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శనివారం కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రహదారులపై భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు, కాషన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆటోలు, స్కూల్‌ వ్యాన్లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకుండా క్రమం తప్పకుండా తనిఖీ లు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌) కె.శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీని వాస్‌, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వరరావు, శ్రీనివాస్‌, హనన్‌, సీసీ ఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement