మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేర కు శనివారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ని ర్వహించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్ర యాణికులను తరలించిన వారిపై కొరడా ఝుళిపించారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వా హనాలు, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేశారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, అనుమానిత వ్యక్తులు, వాహనాలను గుర్తించడం, చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను నియంత్రించడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు మధుసూదన్, రమేశ్, శ్రావణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


