8008013207, 6305921645
కాగజ్‌నగర్‌టౌన్: రెక్కాడితే గాని డొక్కాడని కు టుంబం వారిది. తండ్రి కూలీ పని చేస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటికే తల్లి అనా రోగ్యానికి గురి కావడంతో రూ.12 లక్షల వరకు ఖర్చయ్యింది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎ దురైనా యువతి కల మాత్రం చెదరలేదు. తండ్రి పుస్తకాలు, వసతి, ప్రయాణ ఖర్చులు ఎలా గోల సర్దుబాటు చేయడంతో ఎంతో కష్టపడి చదివి నీట్‌లో 507 ర్యాంక్ సాధించి రిమ్స్‌లో సీటు పొందింది కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన సిందం దీప్తి. సెప్టెంబ ర్ 18న ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ అందుకుంది. తల్లి సిందం మల్లీశ్వరి స్పైనల్ కార్డ్ ఇన్‌స్పెక్షన్ రావడంతో మంచానికే పరిమితమయ్యా రు. చికిత్స, మందులు, రోజువారి అవసరాలతో పాటు కుమార్తెను వైద్య విద్య చదివించడం తండ్రి సిందం రాజేందర్‌కు తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో దీప్తిని చది వించలేని పరిస్థితి వారిది. దాతలు, సేవా సంస్థలు ముందుకొచ్చి తమ కుమార్తె చదువుకు అండగా నిలవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
సిందం దీప్తి
సాయం చేయాలనుకునే వారు ఈ కింది నంబర్‌లలో సంప్రదించగలరు


