వన్యప్రాణి వారోత్సవాలు షురూ | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణి వారోత్సవాలు షురూ

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లో వన్యప్రా ణి వారోత్సవాలు శుక్రవారం ప్రారంభించారు. జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ప్రకృతి ప్రేమికులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ప్రకృతి నడక(నేచర్‌ వాక్‌) నిర్వహించారు. గేట్‌ నంబర్‌ 1 నుంచి బైసన్‌కుంట వరకు నాలుగు కిలోమీటర్లు కాలిన నడకన అడవిలో పర్యటించారు. బైసన్‌కుంటలో బర్డ్‌వాచ్‌ చేశారు. కుంటలు, గడ్డి క్షేత్రాలు పరిశీలించారు. పక్షులను పరిశీలించి మురిసిపోయారు. ఎఫ్‌ఆర్వో బాబా ఖాదర్‌వలీ, సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement