విదేశీ విద్య అధ్యయన పర్యటనకు టీచర్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

విదేశీ విద్య అధ్యయన పర్యటనకు టీచర్‌ ఎంపిక

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

జన్నారం: పొనకల్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉ పాధ్యాయుడు కస్తూరి శ్రీకాంత్‌ విదేశీ విద్య అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. వియాత్నం దేశం వెళ్లేందుకు ఎంపిక చేసిన బృందంలో చోటు దక్కించుకున్నారు. విద్యార్థులకు వినూత్నమైన పద్ధతుల్లో బోధన అందిస్తూ పాఠశాల అభివృద్ధి చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయి రిసోర్సుపర్సన్‌గా, జాతీయస్థాయి దీక్ష పోర్టల్లో కంటెంట్‌ క్రియేటర్‌గా కూడా ఎంపికయ్యారు. గత సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. శుక్రవారం ఆయనను పొనకల్‌ గ్రామ సర్పంచ్‌ జక్కు సుష్మాభూమేష్‌, మండల విద్యాధికారి బి.రాజేందర్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ఎన్‌.విజయకుమార్‌, పీఆర్టీ యూ మండల అధ్యక్ష, కార్యదర్శులు కట్ట రాజ మౌళి, అనుముల రాజన్న అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement