● ఎండల తీవ్రతతో పంటలకు ముప్పు ● ఈశాన్య రుతుపవనాలు కరుణిస్తేనే వరి దిగుబడి | - | Sakshi
Sakshi News home page

● ఎండల తీవ్రతతో పంటలకు ముప్పు ● ఈశాన్య రుతుపవనాలు కరుణిస్తేనే వరి దిగుబడి

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

● ఎండల తీవ్రతతో పంటలకు ముప్పు ● ఈశాన్య రుతుపవనాలు కరుణిస్తేనే వరి దిగుబడి

వర్షం.. సాధారణమే..!

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సీజన్‌ ముగిసి యాసంగి సాగు కాలం సీజన్‌ మొదలైంది. నాలుగు నెలల నైరుతికాలం వెనుదిరిగింది. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని భావించగా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా రుతుపవనాలు మందగించడంతో ఎండల తీవ్రత పెరిగింది. జూన్‌ మూడో వారం నుంచి తొలకరి వర్షాలు మురిపించాయి. దీంతో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు విత్తుకున్నారు. జూన్‌లో 16శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలై చివరిలో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రైతులు నారు పోసుకుని ఆగస్టులో నాట్లు వేసుకున్నారు. పంటలు ఎదిగే, పూతకు వచ్చే కీలకమైన ఆగస్టు నెలలో ఆశించిన వర్షాల్లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సెప్టెంబర్‌ మొదటి వారంలో భార్షీలతో పంటలు నీటమునిగాయి. నైరుతి కాలం రైతులకు కొంత ఖేదం..కొంత మోదం మిగిల్చి వెనుదిరిగింది. జిల్లా సగటున 2శాతం అధిక వర్షం కురిసింది. కోటపల్లి మండలంలో 24శాతం లోటు, బెల్లంపల్లి మండలంలో 42శాతం అధికంగా వర్షం కురువగా.. 16మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది కంటే ఈసారి భూగర్భజలాలు ఒక శాతం పైకి వచ్చాయి. ప్రస్తుతం రుతుపవనాలు వెనుదిరగడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు గత నాలుగు రోజులుగా 36డిగ్రీల నుంచి 38డిగ్రీలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులతో ఎండలు మండుతున్నాయి. ఆలస్యంగా ఆగస్టు నెలాఖరులో వరినాట్లు వేసుకున్న రైతులు పంట ఎదిగే దశలో నీటితడులకు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, బోర్ల ద్వారా నీటి సౌకర్యం లేని రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్‌లో జోరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆలస్యంగా నాట్లు వేసుకున్న రైతులు అకాల వర్షాలపై ఆశలు పెట్టుకున్నారు. ఎండలు ఇలాగే కొనసాగితే పంట చేతికి రావడం కష్టమేనని వాపోతున్నారు.

స్వల్పంగా తగ్గిన వరిసాగు

ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 3,52,700 ఎకరాలు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా 3,22,154 ఎకరాలు సాగైంది. ప్రధానంగా పత్తి 1,72,499 ఎకరాల్లో, వరి 1,46,271 ఎకరాల్లో, పప్పుదినుసులు, ఇతరత్రా పంటలు 5వేల ఎకరాల్లో సాగయ్యాయి. వరి సాగు గత ఏడాది కంటే ఈసారి ఆరు నుంచి ఎనిమిది వేల ఎకరాల వరకు తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుందని, సాగు విస్తీర్ణంలో తేడాలు ఉంటాయని వ్యవసాయ శాఖ భావించింది. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో ప్రణాళికకు అనుగుణంగా పంటలు సాగు కాలేదు.

జిల్లాలో జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వరకు వర్షపాతం వివరాలు(మి.మీటర్లలో)

మండలం సాధారణం కురిసింది అధికం,

లోటు(శాతం)

జన్నారం 998.9 928.1 07 లోటు

దండేపల్లి 921.9 817.4 11 లోటు

లక్షెట్టిపేట 892.9 1020.3 14 అధికం

హాజీపూర్‌ 973.6 920.4 05 లోటు

కాసిపేట 909.5 1016.1 12 అధికం

తాండూర్‌ 875.2 1023.7 17 అధికం

భీమిని 951.5 899.6 05 లోటు

కన్నెపెల్లి 953.7 931.0 02 లోటు

వేమనపల్లి 930.7 991.0 07 అధికం

నెన్నెల 965.2 941.4 02 లోటు

బెల్లంపల్లి 898.3 1268.6 41 అధికం

మందమర్రి 928.5 1029.5 11 అధికం

మంచిర్యాల 975.0 1105.3 13 అధికం

నస్పూర్‌ 975.3 989.8 01 అధికం

జైపూర్‌ 936.0 1040.1 08 అధికం

భీమారం 896.6 762.9 15 లోటు

చెన్నూర్‌ 979.1 833.1 15 లోటు

కోటపల్లి 970.9 740.9 24 లోటు

జిల్లా సగటు 938.4 993.1 02 అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement