గాంధీ మార్గం ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

గాంధీ మార్గం ఆచరణీయం

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జాతిపిత మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఆచరణీయమని జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఏ ర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘ నంగా నివాళులు అర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమానత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గాంధేయ స్ఫూర్తితో సేవలందించాలి

మంచిర్యాలక్రైం: పోలీసులు గాంధేయ స్ఫూర్తితో ప్రజలకు సేవలందించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను రామగుండం కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజల కు న్యాయం, భద్రత, సేవలందించడంలో నిజాయతీతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement