వన్యప్రాణుల రక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల రక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

మంచిర్యాలక్రైం: వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎఫ్‌డీఓ సర్వేశ్వర్‌ అన్నారు. ఈ నెల 2 నుంచి 8వరకు నిర్వహించను న్న వన్య ప్రాణుల వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు, బీట్‌ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌

పోటీలకు ఎంపిక

జన్నారం: ఆదిలాబాద్‌లోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం జరిగిన జోనల్‌ స్థాయి స్విమ్మింగ్‌ ఎంపిక పోటీల్లో ఇంధన్‌పల్లి జిల్లా పరిషత్‌ విద్యార్థులు రేవంత్‌, హరీశ్‌ ప్రతిభ కనబర్చారు. అండర్‌–17 100మీటర్ల బటర్‌ ఫ్లై విభాగంలో ఓ.రేవంత్‌ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, హరీష్‌ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించినట్లు ఎంఈవో రాజేందర్‌, పీడీ శివనూరి తిరుపతి తెలిపారు. రేవంత్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement