మంచిర్యాలఅర్బన్: వివిధ సంక్షేమ హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే గోదాంను ఎస్సీ డీడీ దుర్గాప్రసాద్ పరిశీలించారు. ‘సరుకుల సరఫరాలో అయోమయం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. సీసీసీలోని నిత్యావసర సరుకులు సరఫరా చేసే గోదామును ప్రత్యక్షంగా సందర్శించి నిల్వ ఉన్న సరుకులు, నాణ్యతను పరిశీలించారు. గోదాము నుంచి సంక్షేమ హాస్టళ్లకు సరుకుల పంపిణీ తీరుపై అడిగి తెలుసుకున్నారు. వెంటనే కొన్ని హాస్టళ్లకు అవసరమైన సరుకులు పంపించారు. సరుకుల పంపిణీ ప్రక్రియ వేగంగా జరిగేలా, సమయానికి హాస్టళ్లకు చేరేలా చూడాలని గోదాం ఇన్‌చార్జిని ఆదేశించారు.


