ఐకేపీ కార్యాలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఐకేపీ కార్యాలయంలో చోరీ

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

చింతలమానెపల్లి: చింతలమానెపల్లి మండల ఐకేపీ కార్యాలయంలో బుధవారం రాత్రి చో రీ జరిగింది. కార్యాలయం వెనుకవైపు తలుపులకు ఉన్న స్క్రూలను తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు సామగ్రి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు వచ్చిన అటెండర్‌ హనుమంతు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఐకెపీ కార్యాలయ భవనాన్ని నూతనంగా నిర్మించగా విధుల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన సామగ్రి ఇటీవలే కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ప్రింటర్‌, ఇన్వర్టర్‌, వీడియో కాన్ఫరెన్స్‌ సెట్‌ను దొంగిలించారు. సామగ్రి విలువ సు మారు రూ.2 లక్షలు ఉంటుందని ఐకెపీ ఏపీఎం మోహన్‌దాస్‌ తెలిపారు. సీఐ సంతోష్‌ కు మార్‌, ఎస్సై కమలాకర్‌ సంఘటన స్థలాన్ని పరి శీలించారు. పోలీ సు జాగిలాలు, క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. ఏపీఎం ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement