బెల్లంపల్లి ఏరియాలో 71 శాతం.. | - | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి ఏరియాలో 71 శాతం..

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో సెప్టెంబర్‌ మాసంలో 71 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం శ్రీ రమేశ్‌ తెలిపారు. గురువారం గోలేటిలోని జీఎం కార్యాలయంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఏరియాకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 1.43 లక్షల టన్నులు (71శాతం) సాధించినట్లు తెలిపారు. ఏరియాలో కొత్త ప్రాజెక్టులైన గోలేటి, ఎంవీకే ఓసీపీల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం గోలేటి ఓసీపీ ద్వారా బొగ్గు ఉత్పత్తిని ప్రా రంభించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం స్వామిరాజు, డీజీఎం ఐ ఈడీ ఉజ్వల్‌కుమార్‌ బెహరా, డీజీఎం పర్సనల్‌ కిరణ్‌బాబు, సీనియర్‌ పీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement