మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సెప్టెంబర్ మాసం 130 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపారు. కేకే ఓసీలో 171 శాతం, కేకే 5 గనిలో 104 శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భ గనుల్లో ఉద్యోగుల గైర్హాజరుతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి ఝా, డీజీఎం (పర్సనల్) అశోక్, ఐఈడీ కిరణ్ కుమార్, సీనియర్ పీవో కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.


