జన్నారం: బైక్ పై నుంచి కిందపడి ఒకరు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని రోటిగూడకు చెందిన పురంశెట్టి నగేశ్ (58) గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా జింకల పార్కు సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఎస్సై ఉదయ్‌కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య వెంకవ్వ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


