చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

● సందడి చేసిన హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల్‌ చౌరస్తా వద్ద చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌(సీబీఎస్‌) గురువారం వైభవంగా ప్రారంభమైంది. తె లంగాణలో ఇది ఏడో షోరూం. ప్రముఖ సినీనటి ఐ శ్వర్య రాజేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రా రంభించారు. మున్సిపల్‌ చైర్‌పర్స్‌న్‌ అప్పాల కా వ్య, వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తితో కలిసి జ్యో తి ప్రజ్వలన చేశారు. తర్వాత మాల్‌ అంతా కలియతిరుగుతూ వస్త్రాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులను పరిశీ లించారు. హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాల్‌ ఆవరణ లో ఐశ్వర్య రాజేశ్‌ అభిమానులను పలకరించారు. ‘గోదావరి గట్టు’ పాటకు స్టెప్పులేశారు. షోరూం మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానా సురేశ్‌ మాట్లాడుతూ 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన ప్రతీ చోటా ప్రజల ఆదరాభిమానా లు పొందుతోందన్నారు. నిర్మల్‌ ప్రజల అభిరుచుల కు అనుగుణంగా షోరూం రూపకల్పనతోపాటు వ స్త్రాల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలి పారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని అక్టోబర్‌ 1 నుంచి 5వరకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అనంతరం సినీ నటి ఐశ్వర్య రాజేశ్‌ మాట్లాడుతూ చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిర్మల్‌ ప్రజలు ఈ షాపింగ్‌ మాల్‌ను ఆదరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement