రెబ్బెన: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాయిలో ఈ నెల 2 నుంచి 7 వరకు జరుగనున్న 45వ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు రెఫరీలుగా రెబ్బెన మండలంలోని గోలేటికి చెందిన నలుగురు సీనియర్ క్రీడాకారులు ఎంపికయ్యారు. క్రీడాకారులు కుందారపు నరేష్, పి.శ్రీకాంత్, డి.శ్రీనివాస్, జి.గోపాల్ గురువారం ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు. ఎంపికై న క్రీడాకారులను బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు అభినందించారు.
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపికై ంది. గురువారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ సీవోఈ గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి చెస్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–19 విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారుల్లో డి.రాజు, జె.వంశీ, డి.శశికుమార్, బి.అద్విక్, శివరామ అంజి, పవన్, వరుణ్‌తేజ, ఐ.ధనుంజయ్ ఉన్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బి.బాబురావు, ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. సదరు విద్యార్థులను ఉమ్మడి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కనకయ్య, పీఈటీలు అల్లూరి వామన్, ముత్యకుర్తి రాజశేఖర్, ఉపాధ్యాయులు అభినందించారు.


