జాతీయస్థాయి పోటీలకు మిమ్స్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు మిమ్స్‌ విద్యార్థులు

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

మంచిర్యాలఅర్బన్‌: హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గత నెల 28, 29, 30 తేదీల్లో 12వ తెలంగాణ అథ్లెటిక్స్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్‌ పోటీల్లో మిమ్స్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బి.శృతి (బీకాం సెకండియర్‌) జూనియర్‌ అండర్‌–20 మహిళల విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం సాధించి స్వర్ణ పతకం కై వసం చేసుకున్నారు. అశ్విత (ఎంఎస్‌టీసీఎస్‌ ఫైనలియర్‌) సీనియర్‌ మహిళల 800 మీటర్ల విభాగంలో ద్వితీయస్థానం సాధించింది. బి.విష్ణు (ఎంపీసీ సెకండియర్‌) జూనియర్‌ అండర్‌–20 పురుషుల విభాగంలో 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో ద్వితీయస్థానం సాధించాడు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో చైన్నైలో జరగనున్న జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాసరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రావు, విజయ్‌కుమార్‌, పీడీ నూనె శ్రీనివాస్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement