శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో సెప్టెంబర్‌లో 99 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. గురువారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఉత్తత్తి లక్ష్యం 4.1 లక్షల టన్నులకు గానూ 4.07 లక్షల టన్నులు సాధించినట్లు తెలి పా రు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ టెండర్ల సమస్య పూ ర్తికావడంతో ఉత్పత్తి పెరిగిందన్నారు. శ్రీరాంపూర్‌లో ప్రస్తుతం 34 వేల టన్నుల కోల్ స్టాక్ ఉందని, ప్రతీరోజు 11,500 టన్నుల బొగ్గును ఎస్టీపీపీకి రవాణా చేస్తున్నామన్నారు. ఆర్కే 5 గనిలో సీమ్‌లు తగ్గడంతో ఉత్పత్తి తగ్గిందన్నారు. ఆర్కే 7, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ 1, ఎస్సార్పీ ఓసీపీలు వందశా తం లక్ష్యాన్ని నమోదు చేసుకున్నాయన్నారు. ఏరి యాలో ఇప్పటి వరకు 3,865 మందికి కారుణ్య ఉ ద్యోగాలు కల్పించామన్నారు. సమావేశంలో డీజీ ఎం(పర్సనల్) ఎస్.అనిల్ కుమార్, డీజీఎం(ఐఈడీ) రాజన్న, డీవైపీఎం క్రాంతికుమార్ పాల్గొన్నారు.


