సింగరేణిలో ఆర్థిక సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో ఆర్థిక సంక్షోభం

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

రూ.55 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ సీసీసీ కార్నర్‌లో సింగరేణి బకాయి.. బీజేపీ లడాయి

శ్రీరాంపూర్‌: 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణిని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో నెట్టిందని మ ల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. న స్పూర్‌లోని సీసీసీ కార్నర్‌లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి బకాయి..బీజేపీ లడాయి పే రుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. సింగరేణి నుంచి బొగ్గు, వి ద్యుత్‌ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం రూ. 55 వేల బకాయి పెట్టిందని ఇవి వెంటనే చెల్లించాలన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కతేల్చాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బొగు్‌గ్‌ నిల్వలు లేవని దీని కారణంగా విద్యుత్‌ కేంద్రాలు మూతపడటంతో ప్రభుత్వం అప్రకటిత కోతలు మొదలు పెట్టిందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్‌ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఆయన అహంకారాన్ని దించడానికి ప్రజలు రేవంత్‌ను గద్దెనెక్కిస్తే ఆరు గ్యారంటీల పేరు చెప్పి మోసగించారన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ స ంపదను కేవలం కొద్ది మందికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కార్మికులను డిస్మిస్‌ చేయడం సరికా దని, కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.1250 రోజు వారి వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్‌, డిస్మిస్‌ కా ర్మికులు ఎంపీకి వినతిపత్రాలు అందజేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఏ.శ్రీదేవి, బొడిగే శోభ, జిల్లా అధ్యక్షు డు వెంకటేశ్వర్‌గౌడ్‌, బీఎంఎస్‌ ప్రెసిడెంట్‌, వ ర్కింగ్‌ ప్రెసిడెంట్లు అప్పని శ్రీనివాస్‌, యాదగిరి స త్త య్య, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ ముఖేశ్‌గౌడ్‌, నాయకులు అశోక్‌, సత్యనారాయణ, సంధ్యారాణి, శ్రీని వాస్‌, కృష్ణమూర్తి, నాగేశ్వర్‌రావు, రమేశ్‌, చక్రీ, స దానందం, కమలాకర్‌రావు, శ్రీదేవి, భీమయ్య పా ల్గొన్నారు.

అన్ని సంఘాలు కలిసి పోరాడాలి

– మల్క కొమురయ్య, ఎమ్మెల్సీ

సింగరేణి పరిరక్షణకు అన్ని సంఘాలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. సింగరేణి బలోపేతానికి ఇటీవలే కేంద్రం రెండు బొగ్గు బ్లాకులను కేటియించిందన్నారు. సీఆర్‌ఎస్‌, డీఎంఎఫ్‌టీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు.

బొగ్గు లేక విద్యుత్‌ కోతలు

– పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే

బొగ్గు కొరతతో పవర్‌ప్లాంటు మూతపడటంతో రాష్టంలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. రైతులకు కనీసం 8 గంటలకు విద్యుత్‌ను ఇవ్వడం లేదన్నారు. దీని కారణం సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ సొంత సంస్థగా మార్చుకోవడమే అన్నారు. కమీషన్ల కోసం ఇప్పడు విదేశి బొగ్గు కొనుగోలుకు సిద్దమవుతున్నారని దీన్ని అడ్డుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement