జన్నారం: అక్రమించిన అటవీ భూమిని బుధవారం అటవీ అధికారులు తిరిగి స్వాధీనం చే సుకున్నారు. జన్నారం అటవీ డివిజన్, ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలోని మురిమడుగు గ్రా మం కంపార్టుమెంట్ నంబర్ 233లో సుమా రు 8 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఎఫ్‌డీవో రామ్మోహన్, ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు ఇందన్‌పల్లి ఇన్‌చార్జి రేంజ్ అధికారి బాబ ఖాదర్‌వలీ, తాళ్లపేట రేంజ్ అధికారి వికాస్, ఇందన్‌పల్లి, జన్నారం రేంజ్ సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమి చుట్టూ కందకం తవ్వించారు. డిప్యూటీ రేంజ్ అధికారులు మమత, సాగరిక, విజయ్‌కుమార్, సెక్షన్ అధికారి శేషురావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు మృతి కారకుడికి ఏడాది జైలు
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతికి కారణమైన టిప్పర్ (లారీ) డ్రై వర్ ఏడాది జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ స్థానిక ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోష బుధవారం తీర్పుచెప్పారు. సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 జనవరి 18న జిల్లా కేంద్రంలోని ఏసీసీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గద్దెరాగడికి చెందిన రుద్ర స్వరాజ్ –కృష్ణవేణి నవ దంపతులు పనినిమిత్తం మంచిర్యాలకు బైక్‌పై వస్తున్నారు. లారీ టిప్పర్ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీకొట్టాడు. దంపతులు మృతి చెందారు. అప్పటి సీఐ ముత్తి లింగయ్య కేసు నమోదు చేపట్టారు. రామగుండంకు చెందిన టిప్పర్ డ్రైవర్ చిలుక సంతోష్‌ను రిమాండ్‌కు తరలించారు. కోర్టులో హాజరుపర్చి నేరం రుజువు చేయడంతో ఈ మేరకు జడ్జి తీర్పునిచ్చారు.


