కుస్తీ, వాలీబాల్‌ పోటీలకు.. | - | Sakshi
Sakshi News home page

కుస్తీ, వాలీబాల్‌ పోటీలకు..

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

దండేపల్లి: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్‌ కుస్తీపోటీలకు దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నతపాఠశాల 7వ తరగతి విద్యార్థి జంబోజి రాంచరణ్‌ ఎంపికయ్యాడని ఎంఈవో, పాఠశాల హెచ్‌ఎం మంత్రి రాజు, పీడీ శ్రీనివాస్‌ తెలిపారు. ఆదిలాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్‌–14 విబాగం కుస్తీ ఎంపిక పోటీల్లో రాంచరణ్‌ ప్రతిభ కనబర్చాడు. దీంతో అతను ఈనెల 8నుంచి నారాయణపేట జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడనున్నట్లు వారు పేర్కొన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.

వాలీబాల్‌ పోటీల్లో..

కోటపల్లి: మంచిర్యాలలోని మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన అండర్‌–19 వాలీబాల్‌ పోటీల్లో కోటపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు శ్రీ వైష్ణవి, సంజన ప్ర తిభ కనబర్చారు. అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థా యి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ తె లిపారు. ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement