ఆర్టీసీ భవిష్యత్‌, ఉద్యోగుల భద్రతకు ఓటేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ భవిష్యత్‌, ఉద్యోగుల భద్రతకు ఓటేయాలి

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

మంచిర్యాలఅర్బన్‌: ఆర్టీసీలో చివరి ఎన్నికలు కావొ చ్చు..సంస్థ భవిష్యత్‌, ఉద్యోగుల భద్రత కో సం ఎంప్లాయీస్‌ యూనియన్‌, టీఎంయూ, ఎన్‌ఎంయూ (జేఏసీ)లకు ఓటేసి గెలిపించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల డి పో వద్ద కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ కా ర్మికుల పనిభారం పెరిగిపోయిందని ఆవేదన వ్య క్తం చేశారు. కార్మిక రాజ్యం రావాలంటే, ప్రజా స్వామ్య వ్యవస్థ తిరిగి పునరేకీకరణకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కొట్లాడే నాయకులు, ఇంట్లో పడుకునే నాయకులెవరో గుర్తించాలన్నారు. సామాన్యులకు, సంపన్నవర్గాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభిప్రాయపడ్డారు. అధికార పా ర్టీకి అమ్ముడుపోయిన కొన్ని సంఘాలు మద్యం, డబ్బుతో ప్రలోభ పెడుతాయని, కార్మికులు ఆలో చించి ఓటేయాలని సూచించారు. మంచిర్యాల డి పో, బస్‌స్టేషన్‌ పరిసరప్రాంతాల్లో కార్మికులను కలు సుకుని ఓటు కోసం అభ్యర్థించారు. తెలంగాణ మ జ్దూర్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఏఆర్‌రెడ్డి, ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో సెక్రెటరీ గోలి శంకర్‌, ప్రె సిడెంట్‌ రాజేశం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి, అసిస్టెంట్‌ డిపో సెక్రెటరీలు ఉమారాణి, శంకర్‌, టీఎంయూ సెక్రటరీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement