ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

మంచిర్యాలఅర్బన్‌: పీఎంశ్రీ పాఠశాలల ఆధ్వర్యంలో జిల్లా సైన్స్‌ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయిలో కళా–సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్‌, డీఈవో చంద్రయ్య పోటీలను ప్రారంభించారు. జానపద, శాసీ్త్రయ నృత్యం, సోలో గానం, బృందగానం, నాటకం, కవితా పఠనం, వక్తృత్వం, వాయిద్య సంగీతం, చిత్రలేఖ నం పోటీలు నిర్వహించగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సెక్టోరల్‌ అధికారులు సత్తయ్య, కృష్ణమూర్తి, పోటీల ఇన్‌చార్జీలు గిరిధర్‌, శంకర్‌, జనార్ద న్‌, పూర్వ సెక్టోరల్‌ అధికారి సత్యనారాయణమూర్తి, న్యాయనిర్ణేతలు అశోక్‌, రాజన్న, ప్రసాద్‌, సంతోష్‌, సాంబయ్య, యాదగిరి, శ్రీనివాస్‌, సుమన, శ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జన్నారంలో అధికారులతో సమీక్ష

జన్నారం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సమీక్ష నిర్వహించారు. వీబీజీ రాంజీ పనులు, కూలీల వివరా లు తెలుసుకున్నారు. మురిమడుగు గ్రామంలో చేపట్టిన కుంట పనులు పరిశీలించి కూలీల సంఖ్య పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. కలమడుగు గోదా వరి నది వద్దకు వెళ్లి పుష్కరఘాట్‌ను పరిశీలించి అభివృద్ధిపై ఆరా తీశారు. సమావేశంలో ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌, తహసీల్దార్‌ బక్కయ్య, ఏపీవో రవీందర్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement