మెరుగైన సేవలందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందించడమే లక్ష్యం

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● చెన్నూర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

చెన్నూర్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూర్‌ పట్టణంలో చేపట్టిన 100 పడకల ఆస్పత్రి ప్రహరీ, ఇతర పనులతో పాటు వెనుకబడిన తరగతుల పాఠశాల, కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. అదనపు గదుల నిర్మాణ పనులతోపాటు మధ్యాహ్న భోజనా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పనులను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రి పనులు తుది దశకు చేరాయని, ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం తహసీల్‌ కార్యాలయంలో 2027లో నిర్వహించనున్న పుష్కరాల పనులపై తహసీల్దార్‌ మల్లికార్జున్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రోడ్డు నిర్మాణంలో భూములు పోతున్న రైతులతో మాట్లాడారు. పుష్కరాల కోసం నిర్మించే రోడ్డు పనులకు రైతులు సహకరించాలని కోరారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement