చెన్నూర్: చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అండర్–14 బాలబాలికల జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కనపర్తి రమేశ్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో 16మంది బాలురు, 16మంది బాలికలు ప్రతిభ కనబర్చి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం ఫణిరాజా తెలిపారు. రిటైర్డ్ పీఈటీ రామయ్య, హ్యాండ్‌బాల్ కోచ్‌లు అరవింద్, రాజశేఖర్, పీడీలు విఠల్, ప్రవీణ్, సత్యనారాయణ, రాజయ్య, దీపిక తదితరులు పాల్గొన్నారు.


