పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో మంగళవారం జన తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశాన్ని మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు లంకా పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జన తెలంగాణ పార్టీ ముసాయిదా విధాన ప్రకటన విడుదల చేసి మంచిర్యాల, కుమురంభీం జిల్లాల అడహక్ కమిటీని ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, తదితర అంశాలపై సమావేఽశంలో చర్చ నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్బంగా మంచిర్యాల, కుమురం భీం జిల్లాల కన్వీనర్‌లుగా అర్జున్, రవి కాంత్‌లతో పాటు జిల్లాకు 9 మందిని కమిటీ సభ్యులుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల్నె అజయ్, గురిజాల రవీందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


