గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

దండేపల్లి: రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు చివరకు గోదావరినదిలో శవమై తేలాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్‌కు చెందిన బాదినేని అరవింద్‌ (26) హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతని తండ్రి తిరుపతి అనారోగ్యానికి గురికావడంతో కొంత అప్పులు అయ్యాయి. తండ్రితో ఫోన్‌చేసి మాట్లాడినప్పుడల్లా అప్పుల గురించి చర్చించి బాధపడేవాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అరవింద్‌ ఈ నెల 27న సాయంత్రం ఇంట్లో చెప్పి బైక్‌పై లక్సెట్టిపేటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్‌ చేయగా వస్తున్నాని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా సోమవారం దండేపల్లి మండలంలోని గూడెం గోదావరినది బ్రిడ్జి వద్ద బైకు కనిపించింది. మంగళవారం ఉదయం నదిలో మృతదేహం కనిపించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement