రసవత్తరంగా జోనల్‌ స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా జోనల్‌ స్థాయి పోటీలు

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జోనల్‌ స్థాయి పోటీలు మంగళవారం రసవత్తరంగా సాగాయి. ప్రిన్సిపాల్‌ అరుణశ్రీ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోచ్‌ రవి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా గురుకుల సొసైటీ ఆధ్వర్యలో నిర్వహిస్తున్న అండర్‌ 14, 17, 19 జోనల్‌ స్థాయి ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ, అథ్లెటిక్స్‌ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఖోఖోలో 9 మంది, కబడ్డీలో ఏడుగురు, వాలీబాల్‌లో ఏడుగురు, అథ్లెటిక్స్‌లో 12 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ భద్రకాళి, పీడీ లక్ష్మి, పీఈటీ చిన్నక్క, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement