కార్మికుల హక్కుల సాధనకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల సాధనకు పోరాటం

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

కాసిపేట: కార్మికుల హక్కుల సాధనకు ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని యూనియన్‌ ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య పేర్కొన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిపై ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అధికారుల తీరు వల్ల కార్మికులు తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. గనిలో రక్షణ విభాగాన్ని జనరల్‌ షిప్ట్‌లో కలపడం వల్ల ఉత్పత్తికి విఘాతం కలుగుతుందన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు సరైనవి ఇవ్వకుండా పని చేయిస్తున్నారన్నారు. అధికారులు తమ తీరు మార్చుకోకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్రెటరీ చంద్రశేఖర్‌, పిట్‌ సెక్రెటరీ కారుకూరి తిరుపతి, అసిస్టెంట్‌ పిట్‌ సెక్రెటరీ రవికిరణ్‌, నాయకులు బండారి శంకర్‌, ఓదెలు, సత్తయ్య, భాస్కర్‌, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement