నిర్మల్‌రూరల్: జిల్లాకేంద్రంలోని మంజులాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. రూరల్ ఎస్సై లింబాద్రి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాకేంద్రంలోని వెంకటాపూర్‌కు చెందిన అమరవేణి సిద్ధార్థ గౌడ్(23) ఆదివారం రాత్రి బైక్‌పై మంజులాపూర్ శివారులోని వినాయకుల వద్దకు వెళ్తున్నాడు. విగ్రహం తరలిస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. సిద్ధార్థ తండ్రి నర్సాగౌడ్ గౌడ జనహక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జాతీయ అధ్యక్షుడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబాన్ని పలువురు పరామర్శించి ఓదార్చారు. సిద్ధార్థ ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసిస్తున్నాడు.


