సిర్పూర్(టి): మండలకేంద్రంలోని అంగడిబజార్ ఏరియాలో ఆదివారం రాత్రి అడవి పంది దాడిలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తూరి వినేష్ బస్టాండ్ ప్రాంతంలో మిర్చీల బండిని నడుపుతున్నాడు. రాత్రి బంద్ చేసి తన కూతురితో కలిసి ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్కసారిగా అడవిపంది వచ్చి దాడి చేయగా వినేష్ కాలికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు అతన్ని వెంటనే ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్స చే యించారు. బస్టాండ్ సమీపంలో కాల నీ మధ్యన అడవి పంది రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు రో జులుగా పలుచోట్ల కనిపించిందని, అటవీ అధికారులు అడవిపందిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.


