కేకే–5 గనిలో కూలిన పైకప్పు | - | Sakshi
Sakshi News home page

కేకే–5 గనిలో కూలిన పైకప్పు

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

మందమర్రిరూరల్‌: మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో మంగళవారం గనిలో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఎస్డీఎల్‌ కార్మికుడికి గాయాలయ్యాయి. అధికారులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి బదిలీలో గనిలో మూడవ సీమ్‌ 14వ లెవల్‌ (నాట్‌ వర్కింగ్‌ ప్లేస్‌)లో నిల్వ ఉన్న బొగ్గును ఎత్తడానికి కస్తూరి శంకర్‌ అనే ఎస్డీఎల్‌ ఆపరేటర్‌ను నియమించారు. మంగళవారం తెల్లవారుజామున గోఫ్‌లో బండ కూలింది. ఆ సమయంలో గాలికి ఎస్డీఎల్‌ యంత్రంపై ఉన్న శంకర్‌ కాళ్లకు గాయాలు కాగా, మెడభాగంలో ప్రాక్చర్‌ అయింది. వెంటనే మందమర్రి కళ్యాణిఖనికి, అక్కడి నుంచి రామకృష్ణాపూర్‌ ఏరియాస్పత్రికి పంపించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతా రామయ్య బాధితుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచి కార్యదర్శి సత్యనారాయణ, గని మేనేజర్‌ శంభూనాధ్‌పాండేని కలిసి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ అధికారులు రక్షణను పక్కనపెట్టి బొగ్గు ఉత్పత్తే ధ్యేయంగా పనిచేయించడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement