ఆదిలాబాద్‌టౌన్: అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజే ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని కొత్త కుమ్మరివాడలో మంగళవారం అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసి అధిక శబ్దంతో నిర్వహించిన యజమాని విష్ణు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. డీజేతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
జైనథ్: నిరాల గ్రామంలో అధిక శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేసిన భూపతి గణేశ్, ఏడెల్ల గజానంద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు డీజేలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై గౌతమ్ పవార్, సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్: ీససీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డీజే నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం గడ్‌పూర్‌కు చెందిన సండ్ర కమలాకర్ సీసీసీ నస్పూర్‌లోని సుందరయ్య కాలనీలో ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్స్ నడుపుతున్న యజమాని సండ్ర కమలాకర్, ఆపరేటర్ రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


